ఎవరెస్టుపై ఇద్దరు భారతీయుల మృతి

  • ఎవరెస్ట్ బేస్ క్యాంపు వైపు తిరిగి వస్తుండగా మృతి
  • మృతులను అరుణ్ కుమార్ తివారీ, సందీప్ ఆరేగా గుర్తింపు
  • పయనీర్ అడ్వెంచర్స్‌కు చెందిన పర్వతారోహకులుగా వెల్లడి
ఎవరెస్ట్ శిఖరంపై విషాదం చోటు చేసుకుంది. శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన తర్వాత, ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వైపు తిరిగి వస్తుండగా ఇద్దరు భారతీయ పర్వతారోహకులు మరణించారు. పర్యాటకశాఖ ఏర్పాటు చేసిన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఫీల్డ్ ఆఫీస్ కోఆర్డినేటర్ ఖిమ్‌లాల్ గౌతమ్ మాట్లాడుతూ, ఎవరెస్ట్ అధిరోహణకు అనుమతులు ఉన్న 'పయనీర్ అడ్వెంచర్స్'కు చెందిన ఇద్దరు పర్వతారోహకులు బేస్‌కు తిరిగి వస్తుండగా కుప్పకూలిపోయారని చెప్పారు.

మృతులను అరుణ్ కుమార్ తివారీ, సందీప్ ఆరేగా గుర్తించినట్లు నేపాల్ అధికారులు తెలిపారు. వారు కిందకు దిగుతున్న సమయంలో తీవ్రంగా అలసిపోయారని, రక్షించేందుకు గైడ్స్ తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని తెలిపారు.

పర్వతం దిగుతున్న సమయంలో సందీప్ ఆరే అనే వ్యక్తి మృతి చెందారు. గురువారం సాయంత్రం మరో బృందం పర్వత శిఖరాన్ని చేరుకుని తిరిగి వస్తుండగా అరుణ్ కుమార్ తివారీ అనే వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

Everest
Arun Kumar Tiwari
Sandeep Are
Everest Expedition
Mount Everest deaths
Indian Mountaineers

More Telugu News